Sambashana

Telugu News

Malladi Vishnu: తగ్గిన మల్లాది విష్ణు.. రేసులో వెలంపల్లి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ పార్టీలో టిక్కెట్ల పంచాయితీ జరుగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి తెరపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మెత్తబడినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని మల్లాది విష్ణు నిర్ణయానికి వచ్చారు. వెల్లంపల్లికి వచ్చే ఎన్నికల్లో సహకరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన వర్గానికి సంకేతాలు ఇచ్చారు. రేపు లేదా రేపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. విష్ణుకు ఎమ్మెల్సీ ఇస్తానని ఇప్పటికే అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది. 2 రోజుల్లో సెంట్రల్‌లో బెజవాడ సెంట్రల్‌ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఇంతలో మల్లాది విష్ణు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు. మా మేనిఫెస్టోలోని అంశాలనే చంద్రబాబు, పవన్ పాటిస్తున్నారని విమర్శించారు. 2014లో కలిసి పోటీ చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు.కర్నూలు హైకోర్టు బెంచ్, విశాఖ వ్యాపార రాజధాని అమరావతి మా విధానాన్ని అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం వైసీపీ సరైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. టీడీపీ, జనసేనలు సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోయాయని అన్నారు. ఎన్నికల్లో ఎలా పని చేయాలో కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ సీటుపై తర్వాత మాట్లాడతానని చెప్పారు.