Sambashana

Telugu News

TS Mega DSC 2024: తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. పోస్టుల వివరాలు

1 min read

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయగా… తాజాగా ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. మొత్తం 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషాపండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, స్పెషల్ కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు తాజా నియామకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో https://schooledu.telangana.gov.inలో 4 మార్చి 2024 నుండి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ అదే రోజు నుండి ప్రారంభమవుతుంది.

తాజాగా విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే… హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 537 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 21 మంది మాత్రమే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 176. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 209 ఎస్టీటీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 SGT ఖాళీలు ఉన్నాయి.