Sambashana

Telugu News

CM KCR: అవన్నీ ఫామ్ హౌస్ పంపు.. ఓ షాప్ యజమానికి కేసీఆర్ ఫోన్..

1 min read

CM KCR: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వంటమామిడిలో ఎరువుల దుకాణం యజమానికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే కేసీఆర్ నిజంగానే ఆయనకు ఫోన్ చేశారా? అనే అనుమానం వచ్చింది. నిజంగానే మాజీ సీఎం కేసీఆర్‌ మాటలు విని షాక్‌కు గురయ్యారు. చెప్పండి సార్ అంటూ ఫోన్ పట్టుకోగా.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు. పది రోజుల్లో ఫామ్ హౌస్ కు వస్తానని చెప్పాడు. అంతేకాకుండా వ్యవసాయాన్ని చేసుకుంట అన్నారు. మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి ఎరువుల యాజమాని అడిగాడు. దీనికి స్పందించిన కెసిఆర్ బాగానేవున్న అంటూ బదులిచ్చారు. అయితే ఎరువుల యజమానికి కేసీఆర్ ఫోన్ చేయడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

2023 డిసెంబర్ 8వ తేదీ రాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోవడంతో కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అదే నెల 9వ తేదీన కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత వైద్యులు వాకర్ సాయంతో కేసీఆర్ ను నడిపించారు. ఆస్పత్రిలో వున్న కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్ నంది నగర్ లోని తన ఇంటికి వెళ్లారు. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కావున సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ గడిపేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కోలుకుని మళ్లీ రైతుగా ప్రజల్లోకి రావాలని చూస్తున్నారని అంటున్నారు. కేసీఆర్‌ను చూసేందుకు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ముహూర్తం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.