Sambashana

Telugu News

AP Dasara Holidays: ఏపీకి 13 రోజులు దసరా సెలవులు.. ప్రకటించిన జగన్‌ సర్కార్

1 min read

ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు జగన్ ప్రభుత్వం దసరా సెలవులు ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చారు. అక్టోబరు 13 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సెలవులు అక్టోబర్ 25 వరకు ఉంటాయి. SA-1 పరీక్షలు అక్టోబర్ 5 నుండి 11 వరకు నిర్వహించబడతాయి. 8వ తరగతి విద్యార్థులకు మినహా మిగిలిన వారికి ఉదయం పరీక్షలు జరుగుతాయి. అన్ని ఇతర తరగతులు. అక్టోబర్ 25 వరకు దసరా సెలవులు కొనసాగనుండగా, 26 నుంచి పాఠశాలలు పున:ప్రారంభించనున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు 2023-24 విద్యా క్యాలెండర్‌లో పాఠశాల విద్యా శాఖ ఈ సెలవుల పూర్తి వివరాలను పొందుపరిచింది. అదేవిధంగా క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి ఐదుకు తగ్గించారు.

జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల మూడవ శనివారం తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. ప్రతినెలా మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దసరా సెలవుల విషయానికొస్తే.. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు ఉంటాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.ఇంకా తెలంగాణలోనూ విద్యాసంస్థలకు దసరా సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి 25 వరకు సెలవులు ఇచ్చారు. అక్టోబరు 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.