Sambashana

Telugu News

Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కూలైన్లు కిటకిట

1 min read

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ వీకెండ్ లో కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో తిరుమల భక్తులతో కిటికిట లాడుతుంది. శని, ఆదివారాలు సహజంగానే తిరుమలలో భక్తుల రద్దీ ఉంటుంది. సెలవులు కావడంతో ఎక్కువ మంది శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుమలకు చేరుకుంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడంతో మరింత రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆాదాయం…
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోని భక్తులకు టోకెన్లు లేకుండా ప్రవేశించే వారికి పన్నెండు గంటలలో దర్శనం దొరుకుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమలకు 70,250 మంది భక్తులు వచ్చారు. వీరిలో 34,014 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.14 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.