Sambashana

Telugu News

Deepika Padukone: రణవీర్-దీపికా వివాహమై ఐదేళ్లు.. తొలిసా పెళ్లి వీడియో..

1 min read

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్-దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో స్నేహంగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా పలు భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది ఈ జంట ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఒక్క పెళ్లి వీడియో కూడా అభిమానులతో పంచుకోలేదు. తాజాగా ఆ వీడియో తొలిసారిగా బయటకు వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమవుతున్న ‘కాఫీ విత్ కరణ్’ 8వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎపిసోడ్‌లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె గెస్ట్‌లుగా కనిపించారు.

ఈ సందర్భంగా కారంత్ తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన పలు వివరాలను పంచుకున్నారు. షో సందర్భంగా, కరణ్ జోహార్, దీపికా-రణ్‌వీర్‌ల పెళ్లికి సంబంధించిన క్యూట్ వీడియోను షోలో ప్రదర్శించారు. ఓ పార్టీలో దీపికపై తన ప్రేమను రణవీర్ వ్యక్తం చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెహందీ వేడుక, పెళ్లి వేడుకలు అన్నీ ఈ వీడియోలో చాలా అందంగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీపిక, రణ్‌వీర్‌లు 2013లో విడుదలైన ‘రాహ్ లీలా’ కోసం తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి, వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.