Sambashana

Telugu News

Mega 156 Announcement: బాక్సులు బద్దలవ్వాల్సిందే.. మెగా 156 టైటిల్ అనౌన్స్మెంట్ రేపే..

1 min read

Mega 156 Announcement: మెగాస్టార్ చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది మరియు రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతోంది. పంచభూతాలను కలుపుతూ మూడు లోకాల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని, మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండుగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి సంక్రాంతి రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

జనవరి 15 సాయంత్రం 5 గంటలకు మెగా 156 ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇస్తున్నట్లు నిర్మాతల నుండి అధికారిక ప్రకటన వచ్చింది. కీరవాణి మ్యూజిక్ వర్క్స్‌తో మెగా 156 ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇప్పుడు టైటిల్ అనౌన్స్ మెంట్ సాలిడ్ బజ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. అయితే ఈ ఫాంటసీ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూజ కార్యక్రమాల సమయంలో కూడా విశ్వంభర టైటిల్ పిక్ స్క్రిప్ట్ పేపర్లలో లీక్ అయింది. దీంతో మెగా అభిమానులంతా విశ్వంభర టైటిల్ ను ఫుల్ వైరల్ చేశారు. జగదేక వీరుడు ఈసారి భారీగా వస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఇదే టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారా లేక టైటిల్‌ని మార్చి కొత్త ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి.
CM KCR: అవన్నీ ఫామ్ హౌస్ పంపు.. ఓ షాప్ యజమానికి కేసీఆర్ ఫోన్..