Sambashana

Telugu News

Emmanuel: జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ మృతి.. నిజం తెలిస్తే షాక్

1 min read

Emmanuel: జబర్దస్త్ నుంచి ఇండస్ట్రీలోకి ఎందరో కమెడియన్లు ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా ఈ కమెడియన్ల పంచ్ కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. అదేవిధంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా అందరికీ సుపరిచితమే.. తనదైన ప్రతిభతో పైకి వచ్చి తనకంటూ ఓ గుర్తింపును అందుకున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కమెడియన్ ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో నటించాడు. ఆ వెబ్ సిరీస్ ఏ ప్రేమ వాలంటీర్.. అయితే ఈ సిరీస్ క్లైమాక్స్‌లో ఇమ్మాన్యుయేల్ పాత్ర చనిపోయినట్లు కనిపిస్తుంది. ఇమ్మాన్యుయేల్ నిజంగానే చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు చెప్పుకోలేని విధంగా థంబ్ నెయిల్స్ వేసి రకరకాల ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం వ్యూస్ కోసమే. ఇతరుల గురించి ఆలోచించకుండా ఇలా చేయడం చాలా బాధాకరమని తెలియజేశాడు. ఇమ్మాన్యుయేల్ చనిపోతే వర్ష ఏడుస్తోందంటూ థంబ్ నేల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంపై ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. తాను బతికే ఉన్నా.. బతికుండగానే చనిపోయానంటూ రాస్తున్నాడని.. ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్‌లో పాపం అంటూ ఇమ్మాన్యుయేల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.