Sambashana

Telugu News

Payal: అతన్ని ప్రేమ పేరుతో వాడుకోని వదిలేసిన పాయల్? రియల్ లైఫ్ లో కూడా ‘ఇందు’నే

పాయల్ రాజ్ పుత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆర్ఎక్స్ 100సినిమాలో ఈ బ్యూటీ చేసిన రచ్చను మనోళ్లు ఇప్పట్లో మర్చిపోలేరు. మొదటి సినిమాలోనే విలన్ గా నటించి.. తన గ్లామర్ డోస్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. అంతేకాదు ఈ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో కనిపించిన తీరు చూసిన వరుసగా ఆమెకు బోల్డ్ అవకాశాలే వచ్చాయి. మేకర్స్ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా అలాంటి పాత్రలను ఆమె కోసం సృష్టించి మరీ అవకాశాలు అందిస్తున్నారు. అప్పటి నుంచి అలాంటి పాత్రలే చేసినప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లకు, డైరెక్టర్ హీరోయిన్లకు మధ్య ఎఫైర్స్ కామన్. ప్రస్తుతం పాయల్ విషయంలో కూడా అలాంటిది ఒకటి ఉందన్న వార్తలు వస్తున్నాయి.

అయితే చాలామంది డైరెక్టర్లు , హీరోలు.. హీరోయిన్లను వాడుకొని వదిలేశారని వింటుంటాం కానీ.. పాయల్ మాత్రం ఒక డైరెక్టర్ ను వాడుకోవాల్సినంత వాడుకుని వదిలేసిందన్న వార్త ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది. అది ఏమిటంటే.. పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ కాక ముందే సీరియల్స్ లో నటించింది. స్టార్ ప్లస్ లో ప్రసారమైన చాలా సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేది. అదే సమయంలో వరుస అవకాశాలు ఇస్తున్న ఒక సీరియల్ డైరెక్టర్ తనతో ప్రేమలో పడిపోయాడు. ఈమె కూడా అవకాశాలు వరుసగా ఇస్తుండడంతో అతడితో క్లో్జ్ గా మూవ్ అయింది. ఆ డైరెక్టర్ పేరు రాకేష్ కుమార్. చాలా రోజులపాటు వీరి ప్రేమాయణం సాగిందట. ఆఖరుకు రాకేష్ కుమార్ వీళ్ల ప్రేమాయణం గురించి తన ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లు ఓకే అన్నారట. ఈ విషయాన్ని ఆనందంగా వచ్చి పాయల్ కు చెబితే నో నిన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు. నేను హీరోయిన్ కావాలి కెరీర్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు లేదు అందట. దీంతో ఆ డైరెక్టర్ గుండ్ బద్దలై పోయిందట. చివరకు అమ్మడు ఇచ్చిన షాక్ కు అతడు నెల రోజుల పాటు మనిషి కాలేకపోయాడట. ప్రస్తుతం ఈ విషయం గురించి సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.