Sambashana

Telugu News

Pooja Hegde: సినిమాలే లేవు అయినా 4కోట్లు కారు.. బుట్టబొమ్మ బర్త్‌డే గిప్టా..?

1 min read

Pooja Hegde: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సరైన అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లాలని, అక్కడ కెరీర్ కొనసాగించాలని రకరకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. షాహిద్ కపూర్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా మాల్దీవులు ట్రిప్ చేసి గ్లామర్ తో అదరగొట్టిన పూజా హెగ్డే తన పుట్టినరోజును కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

పూజా హెగ్డే ఇటీవలే కొత్త కారును కొనుగోలు చేసింది. దసరా పండుగ సందర్భంగా లగ్జరీ కారు కొన్న పూజ హెగ్డే.. రేంజ్ రోవర్ ఎస్ యూవీ మోడల్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలో కొత్త కారు దిగుతుండగా కెమెరా కంటికి చిక్కడంతో కారు ముందున్న కెమెరాల్లో ఆమె ఫొటోలు తీశారు. పూజా హెగ్డే బ్లూ అనార్కలీ డ్రెస్‌లు చాలా సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్నాయి. పూజా హెగ్డే కొనుగోలు చేసిన ఈ కారు ధర 4 కోట్ల రూపాయలు అని సమాచారం. పూర్తి లగ్జరీ ఫీచర్ల స్పెసిఫికేషన్లు ఈ కారులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ రేంజ్ రోవర్ SV శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు గరిష్టంగా గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలేవీ లేవు.