Sambashana

Telugu News

Bathukamma: మొదలైన బతుకమ్మ సంబురాలు… సీఎం శుభాకాంక్షలు

తెలంగాణ ఆత్మగౌరవానికి, అద్వితీయ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా పూలను పూజించే పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే వరకు ఆడపిల్లలు, అబ్బాయిలు అందరూ కలిసి ఆటలు, కోలాటాలతో జరుపుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ పండుగ చాటిచెబుతుందని అన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు మహిళా సాధికారతను పెంపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రకృతి మాతను ప్రార్థించారు.

ఈ ఏడాది కూడా సింగపూర్‌లో జరిగే బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు ప్రతి ఇంటి నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ తరలివస్తారు. ప్రతి పువ్వుకు రాసు అని నామకరణం చేస్తూ, ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి స్థానిక తంపానీస్ సెంట్రల్ పార్కులో తెలంగాణ గ్రామీణ సాంప్రదాయ పండుగ బతుకమ్మను జరుపుకుంటున్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి మాట్లాడుతూ.. దసరా పండుగకు ముందు వారాంతం కావడంతో అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని జరుపుకోవాలని తెలిపారు. అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రముఖ గాయకుడు వరం లైవ్ గానం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, కార్యక్రమానికి హాజరైన వారందరికీ రుచికరమైన భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటి 3 ఆకర్షణీయ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు, ఒక అదృష్ట విజేతకు 5 గ్రాముల బంగారం అందజేస్తామని కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. మరింత సమాచారం కోసం కింది వీడియోను చూడాలని నిర్వాహకులు తెలిపారు.