Sambashana

Telugu News

CM KCR: నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో కేసీఆర్‌ పర్యటన.. భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం

1 min read

CM KCR: బీఆర్‌ఎస్‌ అధినేత త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. అనివార్య కారణాల వల్ల నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వాయిదా పడింది. ఆ వెంటనే వనపర్తి నియోజకవర్గంలో సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభకు భారీ ఎత్తున జనసమీకరణ నిర్వహించాలని ఆదేశించారు. కాగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో గులాబీ దళం వ్యూహాత్మకంగా ప్రచారంలోకి దిగుతోంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచార సమయాలను కూడా ఖరారు చేస్తున్నారు. ప్రచారానికి సమయం వస్తుందో లేదోనని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 35 రోజులు మాత్రమే మిగిలి ఉండగానే కారు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. క్లియర్ అయిన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గులాబీ బాస్ కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జడ్చర్లలో ఎన్నికల శంఖారావం పూరించిన ఎనిమిది రోజుల తర్వాత అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభ జరుగుతోంది. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా.. మూడు రోజుల తర్వాత వరుసగా మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు సగం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత ఆయన మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి దశలో మరో ప్రచారానికి తెరలేపనున్నారు. ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ప్రచారం చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్ రావు కూడా అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో రోడ్ షోలు చేపట్టనున్నారు.

CM KCR visit to Nagarkurnool and Vanaparthi districts