Sambashana

Telugu News

MLC Kavitha: అభినవ చాణక్య సీఎం కెసిఆర్.. దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్

1 min read

MLC Kavitha: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తినిచ్చారు. ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థికంగా కాదని… అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులను స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు.

కేసీఆర్ తో సఫలం అయ్యి ప్రదర్శన. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగింది, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, ఇది ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్తు మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరుకుందని అన్నారు.

2014-15నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)118.2 శాతం పెరగగా.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 155.7 శాతం పెరిగింది. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయానికి రూ. 112162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి ₹ 314732కి పెరిగిందని, తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తోందని, అందరికి సమానమైన సందడిని సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారని వివరించారు. ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధిని సాధించింది.

చివరి గింజ వరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తోందని, రైతు బంధు పేరుతో ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72815కోట్లు అందించామని చెప్పారు. ఈ చర్య వల్ల రైతుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని, రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామని వివరించారు. తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 99 శాతం భూరికార్డులు భద్రంగా ఉన్నాయని అవసరమైన రుణాలు కూడా బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మత్తు చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండలా ఉన్నాయని, దానితో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద పెరిగిందని వివరించారు.
MLC Kavitha Invites academic community at Oxford to do case study on Telangana Model