Sambashana

Telugu News

Revanth Reddy: సోనియాగాంధీని ఈడీ ఆఫీస్ కి పిలిచి విచారణ చేయలేదా?

1 min read

కేజ్రీవాల్ మీద విచారణ చేస్తూ ఉంటే..కవిత దొరికిందని టీసీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలలేదని అన్నారు. కేసీఆర్ అవినీతి పరుడు అని బీజేపీ చెప్తుంది ఎందుకు విచారణ చేయట్లేదన్నారు. కేసీఆర్ అవినీతి మీద ఎందుకు విచారణ చేయలేవు బీజేపీ? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ని కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. 100 పిటిషన్లను ఇచ్చాం ..ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. సోనియాగాంధీని ed ఆఫీస్ కి పిలిచి విచారణ చేయలేదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సొంత ఆస్తి నేషనల్ హెరాల్డ్ అన్నారు. 100 కోట్లు తిన్నారు అని కేజ్రీవాల్ పై కేసులు పెట్టింది.. లక్ష కోట్లు తిన్న కేసీఆర్ కి ఉరి వేయాలా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ మాములు బీజేపీకి ఇచ్చి.. సర్కారు నడీపిస్తుంది బీఆర్‌ఎస్‌ అన్నారు. మహిళ రిసేర్వేషన్ సోనియాగాంధీ మానస పుత్రిక అన్నారు. 9 ఏండ్లలో మోడీకి ఓటేసిన brs వాళ్లకు..మీ నాయనకు.. ఐదేళ్లు ఎంపీ గా ఉన్నప్పుడు మోడీని రిసేర్వేషన్ గురించి ఆడిగిందా? అని ప్రశ్నించారు. పాలమూరు లిఫ్ట్ లో కాలువలే లేవు పంపు ఓపెన్ చేశారు! నీళ్లు పోసి లాంచ్ చేశారు! ప్రాజెక్టు కంటే..దాని కంటే ప్రచారంకి పెట్టిన పైసలు ఎక్కువ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్భాటం తప్పితే.. ప్రజలకు ఉపయోగం లేదన్నారు. కేసులు పెట్టిన హర్ష వర్ధన్ రెడ్డి..కేసీఆర్ పక్కనే ఉన్నాడని తెలిపారు. కేసులు వేయించింది కేసీఆర్.. డబ్బులు దోచుకుంటుంది కేసీఆర్ ప్రభుతం సిగ్గులేకుండా పోయిందని అన్నారు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడతారు.. ఆయన కేసీఆర్ అనుచరుడు అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్..కిషన్ రెడ్డి వేరు వేరు కాదని, కేసీఆర్ అనుచరుడు మాట్లాడే మాటలకు మేము పట్టించుకోమ్ అన్నారు. కిషన్ రెడ్డి … బండి సంజయ్ ని ఎందుకు తీసేశారు అనేది చెప్పాలి? రేవంత్ ప్రశ్నించారు. నిన్ను అధ్యక్షుడు గా ఎందుకు నియమించారో చెప్తే చాలు కిషన్ రెడ్డి? అని రేవంత్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు.. భారీ సభలకు నిబంధనలు ఎప్పుడైనా పెట్టారా? అన్నారు. బీజేపీ సభకు జనం ఇంతే మంది రావాలని నిబంధన పెట్టారా? Brs సభలకు కండిషన్ పెట్టారా ? పోలీసులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. కొందరు పోలీసు అధికారులకు చెప్తున్నామన్నారు. Brs కార్యకర్తల లెక్క కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. మేము కూడా గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. కాళేశ్వరంని atm గా మార్చుకున్నది వాళ్ళు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్..లో బీజేపీ..brs చీకటి ఒప్పందం ప్రజలకు ఆర్డమైందన్నారు.

1 thought on “Revanth Reddy: సోనియాగాంధీని ఈడీ ఆఫీస్ కి పిలిచి విచారణ చేయలేదా?

Comments are closed.