Sambashana

Telugu News

Telangana Weather: తెలంగాణ లో ఉరుములు – మెరుపుల తో కూడిన వర్షాలు పడే అవకాశం

1 min read

Telangana Weather: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడుకి దగ్గర్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని.. దీని కారణంగా తమిళనాడు, కేరళ, కర్ణాటతో పాటు తెలుగు రాష్ట్రాలపైనా ఉంటుందని హెచ్చరించింది. ఇవాళ దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.

నేడు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలో రాత్రివేళ కనిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. పగలు కొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు ఉత్తర తెలంగాణలో కొంత వేడి, ఉక్కపోత ఉంటుందని చెప్పారు.