Sambashana

Telugu News

NTR: ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే..? ఇలా ఉండేవాడా..!

1 min read

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో అడుగుపెట్టాడు. నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉండి, ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదిగాడు ఎన్టీఆర్.. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో తన కెరీర్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత సింహాద్రి, ఆది, నాగ, సాంబ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చివరగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ హీరో కాకపోతే ఏమై ఉండేవాడో అనే ఆసక్తి నెలకొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకపోయి ఉంటే వ్యాపారవేత్తగా స్థిరపడి ఉండేవాడిని. కానీ సినిమాలపై ఆసక్తి ఉండి, వ్యాపారవేత్తగా స్థిరపడకుండా ఉంటే.. హీరోగా ఈ స్థాయికి రాకపోయినా.. కనీసం లైట్‌బాయ్‌గా అయినా సినిమాల్లో నిలిచి ఉండేవాడినని ఎన్టీఆర్‌ అన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు.