Sambashana

Telugu News

Rahul Rathika: ఎవరేమనుకున్నా .. రతిక రాహుల్ మధ్య నుంది అదే.. రతిక పేరెంట్స్ సంచలన వ్యాఖ్య

1 min read

Rahul Rathika: రతికా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరు మారుమోగుతుంది. స్టార్ హీరోయిన్ ను మించిన రేంజ్ లో ఆమె గురించి చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్లీ హౌస్‌లోకి రావడమే ఈ చర్చకు కారణం.. మళ్లీ డబుల్ గేమ్‌లు మొదలుపెట్టింది. అంతకు ముందు రతిక అంటే ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ సీజన్ 7 మొదలైన తర్వాతే జనాల్లో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. అయితే హౌస్‌లో ఆమె మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగాజ్‌పై చేసిన పరోక్ష వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ విజేత రాహుల్‌తో రతికకు ఎఫైర్ ఉందని.. వారి సన్నిహిత చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన పేరు చెప్పి కూడా ఆమెను ఇంట్లోకి నెట్టేశారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నాయి.

అయితే రతిక-రాహుల్ ప్రేమపై పేరెంట్స్ స్పందించారు. రతిక తండ్రి రాములు తల్లి అనిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో రతిక చాలా మంచిది.. అందర్నీ మన వాళ్లే అనుకుంటారు.. అయితే కొందరు మాత్రం మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇంటర్ సెకండియర్ లో ఉన్నప్పుడు విజయనిర్మల తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తనకు ఆఫర్ వచ్చిందట. మంచి ఛాన్స్ పైగా మహేష్ తల్లి సినిమా అని తెలిసి షూటింగ్ కి వెళ్ళిందట . కానీ కొన్ని కారణాల చేత సినిమా ఆగిపోయిందట. అప్పుడే తనకు రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెతో రెండు మూడు పాటలు చేశాడు. అలా వారి మధ్య స్నేహం కుదిరింది. మా అమ్మాయికి పెళ్లి కావాలి నాయన.. నువ్వు ఇలాంటి పాటలు తీస్తే మా అమ్మాయిని ఎవ్వరు చేసుకుంటారు అంటూ గట్టిగా మాట్లాడమన్నారు. అంతేకాదు రతిక – రాహుల్ మధ్య అలాంటిది ఏదీ లేదని.. రతిక అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటుందని.. హౌస్ లోపల పల్లవి ప్రశాంత్ కూడా అదే విధంగా మాట్లాడుతుందని.. కానీ బయట వాళ్ళు ఆమెను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని చాలా బాధగా ఉందంటూ ఫీల్ అయిపోయాడు.