Sambashana

Telugu News

Kajal : భగవంత్ కేసరిని అంత మాట అనేసిన కాజల్.. ఎక్కడ తేడా కొట్టిందబ్బా !

1 min read

Kajal : తెలుగు ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జనాలు ఈ ముద్దుగుమ్మను చందమామ అని పిలుచుకుంటారు. దాదాపు కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ చందమామ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాస్త బొద్దుగా మారింది. తర్వాత మళ్లీ వర్కౌట్లు చేసి తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఇటీవలే బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. టాలీవుడ్ క్రష్ శ్రీ లీల నటించింది. అయితే ఇందులో కాజల్ పోషించిన కాత్యాయని పాత్రకు అంతగా రెస్పాన్స్ రాలేదు. దీంతో కాజల్ అభిమానులు రీ ఎంట్రీ కోసం ఎదురుచూసిన నిరాశనే మిగిలింది.

అయితే ఇది అసలు తన రీఎంట్రీనే కాదంటూ కాజల్ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే పెళ్లి తర్వాత భారతీయుడు-2 సినిమాతో పాటు, ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ సినిమా కూడా చేయబోతోంది. సత్యభామ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు చిత్ర మేకర్స్. ఈ భారతీయుడు-2 సినిమా కోసం కలరియట్టు అనే ఒక మరో యుద్ధ రీతిని నేర్చుకుంది కాజల్ అగర్వాల్. ఈ రెండు సినిమాల కోసం దాదాపుగా మూడు నెలల పాటు తన శరీరాన్ని చాలా కష్ట పెట్టింది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తనకు చాలా తృప్తిగా అనిపించిందని .. కెరియర్ లో మొదటిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించానిని చెప్పుకొచ్చింది. ఈ రెండు సినిమాలే తన అసలైన రీ ఎంట్రి సినిమాలంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈమె పైన పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.