Sambashana

Telugu News

Nikhil : తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్

1 min read

Nikhil : టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతడు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట హ్యాపీడేస్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్.. ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ కార్తికేయ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో నిఖిల్ పేరు మార్మోగిపోయింది. దానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2తో తాను పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ సినిమా నిఖిల్ కెరీర్లోనే రూ.100కోట్ల బడ్జెట్ చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా నిఖిల్ స్వయంభు అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం నిఖిల్ దాదాపు మూడ్నెళ్లనుంచి యుద్ధ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. స్వయంభు సినిమా నిఖిల్ కెరీర్ కు 20వది. దీంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఇటీవల నిఖిల్ భార్య పల్లవి కూడా ప్రెగ్నెంట్ అయిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చర్చనీయాంశంగా మారాయి. 2020లో డాక్టర్ పల్లవిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు నిఖిల్. కొద్దిరోజుల క్రితం తన భార్యతో ఒక ఫ్యామిలీ ఈవెంట్ కు హాజరు కాగా అక్కడ తన భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోలను చూసిన అభిమానులు త్వరలోనే నిఖిల్ కూడా తండ్రి కాబోతున్నాడని ఆ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయం పైన ఇప్పటివరకు వీరిద్దరైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే నటుడు శర్వానంద్ కూడా ఇటీవలే తండ్రి కాబోతున్నడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.