Sambashana

Telugu News

BigBoss Swetha: బిగ్ బాస్ శ్వేత ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. అంతా సేఫ్

1 min read

BigBoss Swetha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శ్వేతావర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా వెల్లడించింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలను దక్కించుకుంది శ్వేతా వర్మ. తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందే పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఈ సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన.. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది.

శ్వేతావర్మ తన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం గురించి వివరిస్తూ.. ‘ఓ భయంకరమైన అగ్ని ప్రమాదం మా ఇంట్లో జరిగింది. కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. రూమ్ మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీ, నా పెట్స్ సేఫ్ గానే ఉన్నాం. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి నేను కోలు కోవడానికి కొంత సమయం పడుతుంది. దయచేసి నాకోసం ప్రార్థించండి. మేం ఇప్పుడు బాగానే ఉన్నాము. టెన్షన్ పడొద్దు. కొద్ది రోజులు తర్వాత మళ్లీ నేను సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతాను’ అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బిగ్ బాస్ మరో మాజీ కంటెస్టెంట్ ప్రియా రియాక్ట్ అయింది. నేను ఎప్పుడు నీకోసం ప్రార్థిస్తూనే ఉంటా శ్వేత అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే పలువురు అభిమానులు మీరేం టెన్షన్ పడకండి త్వరగా అంతా సర్దుకుంటుంది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.