Sambashana

Telugu News

Salaar: ప్రభాస్ సలార్ సినిమా వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..

1 min read

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, ఎంటర్టైనర్ చిత్రం సలార్. రెండు పార్టులుగా ఈ సినిమా విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు పోటీగా షారుఖ్ నటించిన డుంకీ సినిమా కూడా విడుదల కానుంది. గతంలో షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తన ఖాతాలో వెయ్యి కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షారుక్ ఖాన్ డుంకీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే విధంగా కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు క్రిస్మస్ సర్కిల్ లో విడుదలైతే ఏ సినిమా విజయం సాధిస్తుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మొదట డుంకీ సినిమా వాయిదా పడుతుందనే వార్త వైరల్‌గా మారింది. దీనికి చెక్ పెడుతూ.. ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేస్తామని డుంకీ మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

దీంతో ‘లార్ సినిమానే పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. దీనిపై సలార్ చిత్ర బృందం కూడా క్లారిటీ ఇచ్చింది. మా టార్గెట్ ఎప్పటికీ మిస్ కాకూడదని.. సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని చిత్ర బృందం ట్యాగ్ లైన్ ఇచ్చింది. డిసెంబర్ 22న సలార్ థియేటర్లలో సందడి చేయడం ఖాయమని చిత్ర బృందం తెలిపింది. అయితే యూఎస్ రీజియన్‌లో ఈ సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. ప్రభాస్ మాస్ అవతార్‌లో కనిపిస్తుండడంతో చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.