Sambashana

Telugu News

NTR 31: వార్ 2 స్టార్ట్ అవ్వలేదు… దేవర కంప్లీట్ అవ్వలేదు అప్పుడే ఎన్టీఆర్ 31?

1 min read

ఫైర్ హౌస్ ల్లాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేస్తున్నాం అనగానే పాన్ ఇండియా రేంజులో బజ్ క్రియేట్ అయ్యింది. 2024 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ బయటకి వస్తూనే ఉన్నాయి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ నుంచి కొన్ని రూమర్స్ బయటకి రావడం మామూలే. అయితే లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న మాట… ఈ ప్రాజెక్ట్ చెప్పిన సమయానికి స్టార్ట్ అవుతుందా? ఎలాంటి వాయిదాలు పడకుండా, ఇప్పటికే అనౌన్స్ చేసినట్లు మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్ళిపోయి… రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాలని ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటున్నాడు కానీ నిజంగా సెట్స్ పైకి మార్చ్ నుంచి వెళ్తుందా అనేది మిలియన్ డాలర్ క్వేషన్ గా నిలిచింది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దేవర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైమ్ తీసుకుంది. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో దేవర షూటింగ్ జరుగుతుంది, ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో అయిపోవచ్చు. దేవర అయిపోగానే డిసెంబర్ నుంచి ఫెబ్ వరకూ వార్ 2 షూటింగ్ జరుగుతుంది. ఇవి ఇప్పుడు అనుకున్నట్లు ఇన్ టైమ్ లో కంప్లీట్ అయితేనే ‘ఎన్టీఆర్ 31’ డిలే అవ్వకుండా చెప్పిన సమయానికి సెట్స్ పైకి వెళ్తుంది. దేవర, వార్ 2 సినిమాల్లో ఏ ఒక్క మూవీ షూటింగ్ డిలే అయినా కూడా 2024 మార్చ్ లో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశమే లేదు.