Sambashana

Telugu News

Rakul Preeth: రకుల్ ప్రీత్ కెరీర్ నాశనం చేసిన స్టార్ హీరోయిన్.. తనతో ఫ్రెండ్షిప్ చేసే ముందే చూసుకోవాలి కదరా !

1 min read

Rakul preeth: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అలాంటి రకుల్‌కు టాలీవుడ్ లో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు మక్కాం మార్చేసింది. ప్రస్తుతం అక్కడ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా కొనసాగుతుంది. కొన్నాళ్ల క్రితం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను దక్కించుకున్న రకుల్ కి సడన్ గా అవకాశాల్లేకుండా పోవడానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అట. రకుల్ ఆమెతో ఫ్రెండ్​ షిప్ చేయడం మూలంగానే తనకు అవకాశాలు రావడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆమె ఎవరా అని ఆలోచిస్తున్నారా.. అసలు రకుల్ కెరీర్ నాశనం అవ్వడానికి.. ఆ హీరోయిన్ కు ఉన్న సంబంధం ఏంటి.. తెలుసుకుందాం. రకుల్ హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైం లో పూర్తిగా ముంబైలోనే సెట్టిల్ అవాల్సి వచ్చింది. అయితే దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న రియా చక్రవర్తి మంచి ఫ్రెండ్ అయింది. వీరిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండడంతో రకుల్ కెరీర్ పై కోల్కోలేని దెబ్బ పడింది. రియా చక్రవర్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవర్ అన్న సంగతి తెలిసిందే.

ఈ కేసు విషయంలో రియా కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయితే సుశాంత్ ఆత్మహత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. సుశాంత్ కేసు నుంచి బయటపడిన తర్వాత వెంటనే ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. ఇలా డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి పేరుతో పాటు నటి రకుల్ పేరు కూడా బయటకు వచ్చింది. కేవలం రియా చక్రవర్తి తో స్నేహం చేయడం వల్లే రకుల్ పేరు కూడా డ్రగ్స్ కేసులో మార్మోగిపోతుందని. అయితే డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడంతో మెల్లమెల్లగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.