Sambashana

Telugu News

GopiChand: హీరో గోపీచంద్ ను ఢీకొట్టబోతున్న తమిళ్ స్టార్ హీరో.. మామూలుగా ఉండదు

1 min read

GopiChand: తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్‌లుగా ప్రవేశించి హీరోలుగా సక్సెస్‌లు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అందులో హీరో గోపీచంద్ ఒకరు. మంచి కథలను ఎంచుకుంటున్నా గోపీచంద్ కు సరైన విజయాలు అందుకోవడం లేదు. తాజాగా దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆఖరికి గోపీచంద్ నటించిన రామబాణం సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో దర్శకుడు గోపీచంద్ ఇద్దరూ విజయం సాధించాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి కొద్దిరోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి రకరకాల అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

ఈ సినిమా హిట్ అయితే గోపీచంద్ కెరీర్ చాలా సాఫీగా సాగిపోతుందని చెప్పొచ్చు. లేదంటే మార్కెట్ భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. దర్శకుడు శ్రీనువైట్లకు కూడా వరుస ఫ్లాపులు ఉన్నాయి కాబట్టి మళ్లీ దర్శకుడిగా సక్సెస్ కావాలి అంటే హిట్ కొడితే మరిన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని చిత్రబృందం ఆలోచిస్తోందని, అయితే ఈ సినిమాలో విలన్‌గా తమిళ ఇండస్ట్రీ నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకున్న మాధవన్‌ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా తప్పకుండా శ్రీనువైట్లకు లైఫ్ ఇస్తుందని అంటున్నారు అభిమానులు. మరి మాధవన్ విలన్ గా నటిస్తున్నాడా లేదా అనే విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.